రూ.33 కోట్లతో లాన్స్ ఆర్మ్ స్ట్రాంగ్ రాజీ!
అమెరికా ప్రభుత్వాన్ని మోసం చేశాడని దాఖలైన కేసులో సైక్లింగ్ మాజీ సూపర్‌స్టార్ లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్ కోర్టు వెలుపల రాజీ కుదుర్చుకున్నాడు. ఇందుకోసం అతడు రూ.33 కోట్లకుపైగా చెల్లించనున్నాడు. ఏడు టూర్ డీ ఫ్రాన్స్ టైటిళ్లు గెలిచిన చరిత్ర సృష్టించిన 46 ఏళ్ల ఆర్మ్‌స్ట్రాంగ్, ఆ కాంలో తాను డ్రగ్స్ తీసుకున్నానని అంగీకరించిన సంగతి తెలిసిందే. దాంతో 2012లో అతడిని సైక్లింగ్ నుంచి బహిష్కరించడంతో పాటు ఆర్మ్‌స్ట్రాంగ్ ఏడు టైటిళ్లను వెనక్కు తీసుకున్నారు. 2000ల నుంచి 2004 వరకు ఆర్మ్‌స్ట్రాంగ్ జట్లును అమెరికా ప్రభుత్వం పోస్టల్ సర్వీసెస్ స్పాన్సర్ చేసింది. డ్రగ్స్ తీసుకోవడం ద్వారా ప్రభుత్వాన్ని మోసగించాడంటూ పోస్టల్ సర్వీసెస్ జట్టు మాజీ సహచరుడు ఫ్లాయిడ్, ఆర్మ్‌స్ట్రాంగ్‌పై రూ.663 కోట్లకు దావా వేశాడు.













