ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన కమలా హ్వారిస్
అమెరికాలో గతంలోలేనంతగా ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో నిలిచిన భారత సంతతి మహిళ కమలా హ్వారిస్ అన్నారు. ఎన్నికల ప్రచారాన్ని ఆమె ప్రారంభించారు. ట్రంప్ విధానాలపై ధ్వజమెత్తారు. దేశ ప్రజాస్వామ్యంపై తీవ్ర దాడి అనంతరం ఇప్పుడు మళ్లీ అమెరికా మార్పు ముంగిట్లోకి వెళ్తోందనీ, ఆ మార్పును ప్రజలు స్వాగతించాలని విజ్ఞప్తి చేశారు. స్వేచ్చా పాత్రికేయంపై దాడి, ఎగతాళి చేసే నాయకులు మనకు ఉన్నప్పుడు, మన ప్రజాస్వామ్య వ్వవస్థలను వారు నీరుగారుస్తున్నప్పడు అది మన అమెరికా కాదు అంటూ ట్రంప్నుద్ధేశించి అన్నారు.













