జాన్సన్ అండ్ జాన్సన్‌కు యూఎస్‌లో ఊరట
క్యాన్సర్ కారకాల కేసులో ప్రముఖ శిశు సంరక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థ జాన్సన్ అండ్ జాన్సక్కు ఊరట లభించింది. జాన్సన్ బేబీ పౌడర్‌లో క్యాన్సర్ వ్యాధి కారకాలున్నాయని దాఖలైన లిటిగేషన్ కేసును అమెరికాలోని ఓ జ్యూరి కొట్టివేసింది. మిస్సోరిలోని వికీ ఫారెస్ట్ అనే ఓ మహిళా క్యాన్సర్ బారిన పడటానికి జాన్సన్ బేబీ పౌడర్ కారణం కాదని ప్రకటించింది. కాగా, జాన్సన్‌కు మద్దతుగా ఈ తరహా తీర్పులు రావడం వరుసగా ఇది నాలుగోసారి కావడం గమనార్హం. జాన్సన్ బేబీ పౌడర్ సురక్షితమని, ఇందులో ఆరోగ్యానికి ఏ రకంగానూ హానిచేసే కారకాలు లేవని జ్యూరి సృష్టం చేసినట్లు ఓ ప్రకనటలో జాన్సస్ సంస్థ తెలియజేసింది.













