కూలిన ఎఫ్-35… అందోళనలో అమెరికా
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రక్షణ ప్రాజెక్టు ఎఫ్ 35. భవిష్యత్తులో నాటో కూటమి, అమెరికా మిత్రదేశాలను రక్షించే ఆయుధంగా పేరుతెచ్చుకుంది. ఈ ప్రాజెక్టు టెక్నాలజీ భద్రత విషయంలో అమెరికా నాటో దేశమైన టర్కీతో సంబంధాలు తెంపుకొనేందుకు కూడా సిద్ధమైందంటే దీని విలువను అర్థం చేసుకోవచ్చు. ఏప్రిల్ 9వ తేదీ ఉదయం 9:59కు సాధనలో భాగంగా జపాన్లోని మిసవా బేస్ నుంచి గాల్లోకి ఎగిరిన విమానం ఎఫ్35ఏ అరగంటలోపే రాడార్ నుంచి అదృశ్యమైపోయింది. దీంతో విమానం పసిఫిక్ సముద్రంలో కూలిపోయినట్లు జపాన్ అధికారులు నిర్థారించుకున్నారు. దీంతో ఒక్కసారిగా అమెరికా, జపాన్లు అప్రమత్తమైపోయాయి. ఈ విమానం జపాన్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ పరిధిలోని జలాల్లోనే కూలిపోయినట్లు అనుమానించారు. కొద్ది గంటల్లోనే విమాన శకలాలను గుర్తించామని జపాన్ సైన్యం ప్రకటించినా కీలక భాగాలు మాత్రం ఇంకా వారి చేతికి అందలేదు.













