డొనాల్డ్ ట్రంప్ కు జ్ఞాపికగా చరఖా!
భారత్ పర్యటనలో భాగంగా సబర్మతి ఆశ్రమానికి రానున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఒక చర్ఖాను, గాంధీజీ చిత్రపటాన్ని, మహాత్ముడి జీవన విధానాన్ని వివరించిన మై ఎక్స్పరిమెంట్స్ విత్ ట్రూత్, మై లైఫ్.. మై మేసేజ్ పుస్తకాలను బహుకరించనున్నారు. ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 24న ఆశ్రమంలో కొద్దిసేపు గడుపుతారని సబర్మతి ఆశ్రమ ట్రస్టీలు కార్తికేయ సారాభాయి, అమృత్ మోదీ వెల్లడించారు. చర్ఖాతో పాటు భారత స్వాతంత్య్ర సమరంలో చర్ఖా పోషించిన పాత్రకు సంబంధించిన వివరాలున్న చిన్న పుస్తకాన్ని ట్రంప్ దంపతులకు ఇస్తామని అమృత్ మోదీ వెల్లడించారు.













