అమెరికాకు షాక్ ఇచ్చిన భారత్
ట్రేడ్‌వార్‌తో ప్రపంచ వాణిజ్య రంగాన్ని వణికిస్తున్న అమెరికాకు షాకిచ్చేలా భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అమెరికా మొదలు పెట్టిన వాణిజ్యపోరుకు భారత్ సై అంది. దీనిలో భాగంగా అమెరికా నుండి దిగుమతి అయ్యే పప్పు, కాయధాన్యాలు, అర్టిమియా వంటి అనేక వస్తువులపై భారత్ కస్టమ్స్ సుంకాన్ని పెంచింది. ఈ దిగుమతి సుంకం ఆగస్టు 4 నుండి అమల్లోకి వస్తుందని ఆర్థిక శాఖ ప్రకటించింది. పచ్చి శనగపై 60 శాతం, కాయ ధాన్యాలపై 30 శాతం వరకు సుంకాన్ని పెంచింది. నట్స్, ఇనుము, ఉక్కు, పియర్స్, స్టెయిన్లెస్ స్టీల్, ట్యూబ్, పైప్‌ల మధ్య అమరికలు, మరలు, బోల్టులు వంటి పరికరాలపై కూడా పెంచింది. బరిక్ ఆమ్లం, ఫౌండరీ అచ్చుల కోసం బైండర్లపై 7.7 శాతాన్ని పెంచింది. ఆర్టీమియాలో ఒక రకమైన రొయ్యలపై కూడా 15 శాతాన్ని పెంపుదల చేసింది.
యూఎస్ నుండి దిగుమతి చేసుకుంటున్న మోటార్ సైకిళ్లపై ఎటువంటి సుంకం పెంపు చేయలేదు. గత వారం కస్టమ్స్ విధులు 50 శాతం వరకు పెంచుతున్నట్లు సవరించిన 30 వస్తువుల జాబితాను ప్రపంచ ఆర్థిక సంస్థకు భారత్ నివేదిక పంపింది. ఉక్కు, అల్యూమినియంపై సుంకాన్ని పెంచిన గత మార్చిలో పెంచిన అనంతరం ఈ వాణిజ్య పోరు మొదలైన సంగతి తెలిసిందే.













