బియ్యం ఎగుమతులు నిలిపివేసిన ఇండియా.. అమెరికా లో ఎన్ఆర్ఐ లు బియ్యం కోసం పరుగులు..
ఇదివరకు, ఓ 10 ఎళ్ల క్రితం ఐటీ ఇండస్ట్రీ ని విశ్లేషిస్తూ “ఒక వేళ అమెరికా కు తుమ్ము వస్తే .. ఇండియా కు జలుబు చేస్తుంది” అని జోక్ వేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి రివర్స్ లో జరుగుతోంది అని చెప్పోచ్చు. నిన్నటి రోజు, గురువారం 20 జులై 2023 వ తేదీన బాసుమతి మినహా ఇతర బియ్యం రకాల ఎగుమతులు అన్ని నిలిపి వేస్తూ భారత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ రోజు, శుక్రవారం, 21 జులై 2023 వ తేదీ ఉదయం నుంచే “బియ్యం సప్లై ఆగిపోయిందిట.. మార్కెట్ లో బియ్యం దొరకదుట !” అన్న వార్త కార్చిచ్చు లా వేగం గా అందరి ఇళ్లకు చేరింది. ఉదయమే ఇండియన్ గ్రోసరీ షాప్ లలో బియ్యం కోసం ఎన్ ఆర్ ఐ లు క్యూ లు కొట్టడం మొదలెట్టారు. గ్రోసరీ షాప్ వాళ్ళు మధ్యాన్నం నుంచే 20lbs ల రైస్ బాగ్ ల ధరలు పెంచటం, ఒక మనిషి కి ఒక బాగ్ మాత్రమే అని రూల్ పెట్టడం, మొత్తం సరుకులు కొని $100 ల బిల్ చేస్తేనే రైస్ బాగ్ కొనవచ్చు అనే రూల్ పెట్టడం చకచకా జరిగిపోయాయి.
ఇండియా ప్రపంచం కొనే బియ్యం ఉత్పత్తి చేసే దేశాలలో రెండో స్థానంలో వుంది ( చైనా తర్వాత ఇండియా నే ) అలాగే ప్రపంచంలో అన్ని దేశాలకు జరిగే బియ్యం ఎగుమతులతో 40% ఇండియా నుంచే అని తెలుస్తోంది. అయితే ఇండియా లో ఈ సంవత్సరం వచ్చిన పంటను బట్టి, మాన్సూన్ పరిస్థితులను బట్టి వచ్చిన బియ్యం ఉత్పత్తి దేశానికి సరిపోతుంది అని, ఎగుమతి చేస్తే దేశం లో బియ్యం కొరత రావచ్చు, దాని వలన ధరలు బాగా పెరిగే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావించి ఎగుమతులను నిలిపివేసినట్లు గా తెలుస్తోంది. అమెరికా లో CNN వార్తా సంస్థ 2023 లో ప్రపంచం మొత్తం గా ఫుడ్ కొరత ఉంటుందని, ఉక్రేయిన్ -రష్యా ల మధ్య యుద్ధం వలన ఉక్రెయిన్ దేశం నుంచి గోధుమలు ఎగుమతి చేయటం ఆగిపోయింది అని, ఈ సంవత్సరం వచ్చే ఫుడ్ కొరత దాదాపు రెండు దశాబ్దాల కాలంలో అతి పెద్దది అని వర్ణించారు.
అయితే ఈ పరిస్థితి చాలా రోజులు ఉండదని, ఎక్కువ గా కంగారు పడి అవసరం కంటే ఎక్కువగా కొనవద్దు అని, అలా చేయటం వలన వ్యాపారస్తులు మరింత లాభం పొందేలా అమ్మకాలు చేస్తారని కొందరు పెద్దలు చెపుతున్నారు.













