భారత్ లో అమెరికా కంటే ఎక్కువ కేసులు
అమెరికా లాగా భారత్, చైనా దేశాలు అధిక సంఖ్యలో కరోనా టెస్టులు చేసి ఉంటే అవి కేసుల సంఖ్యలో అమెరికాను అధికమించేవని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా వ్యాఖ్యానించారు. అమెరికాలో దాదాపు 2 కోట్ల పరీక్షలు నిర్వహించామని తెలిపారు. కరోనాను కట్టడి చేసిన దేశాలుగా పేరు పొందిన జర్మనీ, దక్షిణ కొరియాలోనూ ఈ స్థాయిలో పరీక్షలు నిర్వహించలేదన్నారు. జర్మనీలో 40 లక్షలు, దక్షిణ కొరియాలో 30 లక్షల పరీక్షలు జరిగాయని చెప్పుకొచ్చారు. జాన్ హాపక్పిన్స్ యూనివర్శిటీలోకి కరోనా సమాచారం కేంద్రం లెక్కల ప్రకారం.. అమెరికాలో ఇప్పటి వరకు దాదాపు 11 లక్షల కరోనా కేసులు వెలుగు చూశాయి. దాదాపు లక్ష మంది కరోనాకు బలయ్యారు. దీంతో కరోనా కారణంగా అత్యధికంగా ప్రభావితమైన దేశంగా అమెరికా అవతరించింది. చైనాలో మొత్తం కేసుల సంఖ్య దాదాపు 85 వేలు కాగా, భారత్లో 2,96,184 కేసులు నమోదయ్యాయి.













