MATA: మాటా ఆధ్వర్యంలో ‘ఐడల్ గంధర్వ’ పురస్కారాలు
మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (MATA) ఆధ్వర్యంలో సంగీత ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐడల్ గాంధర్వ పురస్కారాల (IDOL GANDHARVA AWARDS) ప్రదానోత్సవాన్ని నిర్వహించనున్నారు. దివంగత సినీ గేయ గాంధర్వుడు డా. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గౌరవార్థం ఈ అవార్డులను ప్రకటించారు. ఈ వేడుక నవంబర్ 27, 28, 29 తేదీలలో (సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు) విశాఖపట్నంలో జరగనుంది. ఈ సందర్భంగా నవంబర్ 27న జగద్గురు శ్రీశ్రీశ్రీ పద్మభూషణ్ బాల్యసాయి బాబా గారి 105వ జయంతి, నవంబర్ 28న సినీ సంగీత ప్రపంచంలో యుగ పురుషులు ఘంటసాల వెంకటేశ్వరరావు 103వ జయంతి, నవంబర్ 29న దివంగత నటి శ్రీమతి సావిత్రి 91వ జయంతిని పురస్కరించుకుని నివాళులు అర్పిస్తారు. ఐడల్ గంధర్వ (Idol Gandharva) అవార్డ్స్ చైర్‌పర్సన్‌గా డా. బి. శరత్ చంద్రరావు వ్యవహరిస్తారు.
మాటా (MATA) 2వ గ్రాండ్ కన్వెన్షన్-26ను వచ్చే ఏడాది జూన్ 19-20 తేదీలలో ఫిలడెల్ఫియాలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. మరిన్ని వివరాల కోసం దాము గుడాల (+1 857-571-7112), సతీష్ చంద్ర (+91 95422 44466)ను సంప్రదించవచ్చు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు శ్రీనివాస్ కానగని, ప్రదీప్ సమల, కిరణ్ దొడ్డగాయి, విజయ భాస్కర్ కాలా, శ్రీధర్ గుడాల, ప్రవీణ్ గుడురు, శిరీష గుండపునేని, మహేందర్ నార్ల, శ్రీధర్ పెమ్త్యాల, బాబా సీఏ సత్యనారాయణ, దాము గుడాల, రామ్మోహన్ చిన్నాల, మల్లిక్ రావు బోళ్ల సహా పలువురు మాటా (MATA) ఇండియా కమిటీ సభ్యులు కృషి చేస్తున్నారు.













