Diwali: శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ కొత్త ఆఫీసులో ఘనంగా దీపావళి వేడుకలు

శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ తమ కొత్త కార్యాలయం అయిన 71 స్టీవెన్సన్ బౌలేవార్డ్‌లో మొట్టమొదటి దీపావళి వేడుకలను (Diwali Celebrations) ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో పాల్గొన్న కమ్యూనిటీలోని ప్రముఖులు, రాజకీయ నాయకులు, వివిధ వర్గాల ప్రజలను కాన్సుల్ జనరల్ డా. కె. శ్రీకర్ రెడ్డి (Dr. K. Srikar Reddy) సాదరంగా ఆహ్వానించారు. ఈ (Diwali Celebrations) వేడుకలకు కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బోంటా, అలమెడ కౌంటీ సూపర్‌వైజర్ డేవిడ్ హాబర్ట్ కూడా హాజరయ్యారు. ప్లెజంటన్ మేయర్ జాక్ బాల్చ్, ఫ్రీమాంట్ మేయర్ రాజ్ సల్వాన్, డబ్లిన్ మేయర్ షెర్రీ హూ, శాన్ రామోన్ మేయర్ మార్క్ ఆర్మ్‌స్ట్రాంగ్, మిల్పిటాస్ మేయర్ మిస్ కార్మెన్ మోంటానో తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వేడుకలో భారతీయ సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ, దీపావళి స్ఫూర్తిని చాటుతూ రంగోలీలు, దీపాలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ఈ వేడుకలు విజయవంతం కావడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కాన్సుల్ జనరల్ డా. కె. శ్రీకర్ రెడ్డి (Dr. K. Srikar Reddy) కృతజ్ఞతలు తెలిపారు.