GWTCS స్వర్ణోత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం : ఉగాది వేడుకల్లో అధ్యక్షుడు కృష్ణ లాం
అమెరికా రాజధాని ప్రాంతం వేదికగా.. బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో వందలాది మంది పెద్దలు, చిన్నారులు, మహిళల సందడితో..తెలుగు ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి.. ముఖ్యంగా ఆపాత మధురాలు – మెలోడియస్ మూమెంట్స్ పేరిట జరిగిన సంగీత విభావరి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని అధ్యక్షులు కృష్ణ లాం తెలిపారు.
శనివారం మధ్యాహ్నం మూడుగంటల నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమాలు రాత్రి 10 గంటల వరకూ నిరంతరంగా సాగాయి.. రక రకాల వేష ధారణతో..చిన్నారుల పలు నృత్య కార్యక్రమాలు అన్ని తరాల వారిని ఆకట్టుకున్నాయి. తదుపరి ప్రముఖ గాయకులు SP చరణ్, గాయనీమణి సునీత గార్ల ప్రత్యేక పాటల విభావరి అని తరాల వారిని ఎంతో అలరించింది. ఉగాది పండుగ సంప్రదాయాన్ని చాటి చెప్పే పలు రకాల తెలుగింటి వంటకాలతో విందును అందించారు.
అధ్యక్షులు కృష్ణ మాట్లాడుతూ.. ఎల్లలు లేని తెలుగు భాష .. అనాదిగా తెలుగు బాష వైభవం, కళా, సంస్కృతీ సంప్రదాయాలను సరిహద్దులను దాటించి ఈనాడు లక్షలాది మంది తెలుగు వారు నివసిస్తున్న అమెరికాలో సైతం ప్రతి తెలుగింటి పండుగను జరుపుకుంటూ.. ప్రాముఖ్యతను చాటుతూ.. అన్ని తరాల వారిని అలరిస్తూ, తెలుగు భాషను సజీవంగా నిలబెడుతున్న వేదికలు, సంఘాలలో అగ్ర తాంబూలం బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘానికి దక్కుతుంది.. ఇది సంస్థకు స్వర్ణోత్సవ సంవత్సరం (1974 – 2024) అని.. అందరి సహకారంతో స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.
తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన మాట్లాడుతూ.. ఐదు దశాబ్దాల క్రితం ఎందరో పెద్దల సహాయ, సహకారాలతో మొదలైన ఈ ప్రవాస తెలుగు సంస్థ. ఇంతింతై అటుడింతై అన్నట్లు ఎదిగి ఎన్నో ప్రవాస సంఘాలకు ఆదర్శంగా, మూలంగా నిలిచింది. స్వర్ణోత్సవ వేళ ప్రవాస సంఘాలన్నీ ఏకమై ఈ వేడుకను నిర్వహిస్తామన్నారు.
తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నరేన్ కొడాలి మాట్లాడుతూ.. సజీవమైన తెలుగు భాషను అమెరికాలో సైతం ఈ తరానికి చేరువ చేసే ఇలాంటి కార్యక్రమాలు అభినందనీయం అన్నారు.
చివరిగా సంస్థ అధ్యక్షులు కృష్ణ లాం, కార్యవర్గ సభ్యులు కలిసి అతిధులు, ప్రముఖ గాయకులయిన SP చరణ్, సునీత గార్లను ఘనంగా సత్కరించారు..కళను ప్రోత్సహించటం, కళాకారులను సత్కరించటం తెలుగింటి సంప్రదాయమని కార్యవర్గసభ్యులు చంద్ర మాలావతు, సుశాంత్ మన్నే, రవి అడుసుమిల్లి, భాను మాగులూరి, సుష్మ అమృతలూరి, పద్మజ బేవరా, గంగ శ్రీనివాస్, విజయ్, ప్రవీణ్ రాజేష్, ఉమాకాంత్, శ్రీ విద్య సోమ తెలుపారు.. పూర్వ అధ్యక్షులు సత్యనారాయణ మన్నే, సాయి సుధా పాలడుగు మరియు తానా ప్రాంతీయ ప్రతినిధి సతీష్ చింత, విజయ్ గుడిసేవ, సత్య సూరపనేని పాల్గొని కార్యక్రమాలను కొనియాడి. స్వర్ణోత్సవాలు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.







