Annual Picnic: జీడబ్ల్యూటీసీఎస్, తానా వార్షిక పిక్నిక్‌కు రెడీ

గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (GWTCS), ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) సంయుక్తంగా వార్షిక పిక్నిక్ (Annual Picnic) ఏర్పాటు చేస్తున్నాయి. సెప్టెంబరు 20వ తేదీన వర్జీనియాలోని లేక్ ఫెయిర్‌ఫాక్స్ పార్క్‌లో ఈ పిక్నిక్ కార్యక్రమం జరగనుంది. తానా ప్రెసిడెంట్ డాక్టర్ నరేన్ కొడాలి, జీడబ్ల్యూటీసీఎస్ అధ్యక్షులు రవి సి. అడుసుమిల్లి, తానా క్యాపిటల్ రీజియన్ రీజనల్ వైస్ ప్రెసిడెంట్ సుధీర్ కొమ్మి ఆధ్వర్యంలో ఈ పిక్నిక్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని (Annual Picnic) విజయవంతం చేయడానికి తానా లీడర్‌షిప్ టీం, జీడబ్ల్యూటీసీఎస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ కృషి చేస్తున్నాయి.