అంతర్జాతీయ పురస్కారానికి ఎంపికైన థన్‌బర్గ్
స్వీడన్‌కు చెందిన పర్యావరణ వేత్త గ్రేటా థన్‌బర్గ్‌ను అంతర్జాతీయ బాలల శాంతి పురస్కారం వరించింది. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు విద్యార్థులు కదిలి వచ్చేలా చేసినందుకు ఈ అవార్డు దక్కింది. స్పెయిన్‌లో జరగనున్న ప్రపంచ వాతావరణ సదస్సులో పాల్గొనడానికి పయనమైన థన్‌బర్గ్ ఈ అవార్డును స్వయంగా స్వీకరించలేకపోయారు. కానీ అవార్డు దక్కడం ఎంతో గౌరవంగా ఉందన్నారు. థన్‌బర్గ్‌కు బదులుగా ఈ బహుమతిని జర్మన్‌కు చెందిన పర్యావరణవేత్త లూయిసా మేరీ అందుకున్నారు. థన్‌బర్గ్‌తో పాటు ఆఫ్రికాలోని కామెరూన్ దేశానికి చెందిన 125 ఏండ్ల దివినా మాలౌమ్కు కూడా ఈ అవార్డు దక్కింది. డచ్‌కు చెందిన బాలల హక్కుల సంస్థ 2005 నుంచి ఈ అవార్డును అందిస్తోంది. స్కూల్ స్ట్రైక్స్ ఫర్ ది క్లైమెట్ ఉద్యమంతో ఎంతో ప్రసిద్ధి చెందారు థన్‌బర్గ్. ప్రపంచవ్యాప్తంగా పదివేలమంది చిన్నారులు ఈ ఉద్యమలో పాల్గొన్నారు.













