గూగుల్ కు తప్పని సెగ..
కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో గూగుల్ అప్రమత్తమైంది. సిలికాన్ వ్యాలీ, శాన్ప్రాన్సిస్కో, న్యూయార్క్‌లోని తమ కార్యాలయాలకు వచ్చే సందర్శకులను కట్టడి చేస్తున్నది. ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసుకునే అవకాశాన్ని ఇచ్చిన గూగుల్ ఉద్యోగార్థులకూ ఇంటర్వ్యూలను ఆపేస్తున్నది. తమ సాఫ్టువేర్ అభివృద్ధి సమావేశాలనూ రద్దు చేసుకుంటున్నది. యాపిల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ సంస్థలూ తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసే సౌకర్యాన్ని కల్పించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ వారం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలని యాపిల్ సృష్టమైన ఆదేశాలు జారీ చేయగా, ట్విట్టర్ సోమవారం నుంచే ఉద్యోగులకు ఇంటి పని సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.













