రూ.1,199కే గో- ఎయిర్ టిక్కెట్
విమానయాన సంస్థ గో-ఎయిర్ మరో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఫ్లై స్మార్ట్- సేవ్ బిగ్ పేరుతో ప్రకటించిన ఆఫర్ కింద ప్రారంభ విమాన టిక్కెట్ రూ.1,199గా నిర్ణయించింది. నేటితో ముగియనున్న ఈ ఆఫర్ కింద బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు ఒక్కో రూట్‌కు ఒక్కో విధంగా కాలపరిమితి నిర్ణయించింది. గోవా-హైదరాబాద్ ( టిక్కెట్ ధరను రూ.1,399గానూ, జూలై 1 నుంచి సెప్టెంబర్ 15లోగా), బెంగళూరు-హైదరాబాద్ (టిక్కెట్ ధర రూ.1,399, జనవరి 18 నుంచి ఫిబ్రవరి 20 వరకు), హైదరాబాద్-బెంగళూరు (టిక్కెట్ రూ.1,499, జనవరి 18 నుంచి ఫిబ్రవరి 20 వరకు )గా నిర్ణయించింది.













