నటి లిండాకు క్షమాపణ చెప్పిన మాజీ అధ్యక్షుడు
అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి హెచ్.డబ్ల్యు.బుష్ నటి హీథర్ లిండాకు క్షమాపణ చెప్పారు. నాలుగేళ్ళ క్రితం ఒక కార్యక్రమంలో ఫోటో కోసం పొజిచ్చినపుడు బుష్ తనను అసభ్యంగా తాకారని, అది ఆయన భార్య బార్బావా బుష్ కూడా చూశారని లిండా పేర్కొన్న నేపథ్యంలో ఈ క్షమాపణ వెలువడింది. బుష్‌పై వచ్చిన ఆరోపణలపై ఆయన ప్రతినిధి ఒక ప్రకటన చేస్తూ, ఎలాంటి పరిస్థితుల్లోనూ మాజీ అధ్యక్షుడు బుష్ ఉద్దేశ్వపూర్వకంగా ఎవరినీ ఇబ్బందులకు గురి చేయరని, ఒకవేళ హాస్యంగా చేసిన ప్రయత్నం లిండ్ను ఇబ్బంది పెట్టినట్లైతే అందుకు ఆయన నిజాయితీగా క్షమాపణలు చెబుతున్నారని పేర్కొన్నారు. 93 ఏళ్ళ వయస్సులో ఉన్న బుష్ దాదాపు ఐదేళ్ళుగా వీల్‌చైర్‌కే పరిమితమయ్యారు.













