TAMA: టామా ఆధ్వర్యంలో ఉచితంగా ఫ్లూ షాట్స్
తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA) ఆధ్వర్యంలో ఉచితంగా ఫ్లూ టీకాలు (Flue Shots) వేసే కార్యక్రమం నిర్వహించనున్నారు. సెప్టెంబరు 27వ తేదీ శనివారం నాడు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుందని టామా (TAMA) తెలిపింది. జార్జియాలో మెక్గిన్నిస్ విలేజ్ ప్యాలెస్‌లోని టామా ఆఫీసులోనే ఈ కార్యక్రమం జరగనుంది. మూడేళ్ల కన్నా ఎక్కువ వయసున్న వారంతా ఈ కార్యక్రమం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని, రిజిస్టర్ చేసుకున్న వారికే ఉచితంగా టీకాలు వేస్తారని (TAMA) నిర్వాహకులు తెలిపారు. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఆ సమాచారం కూడా అందించాలని కోరారు.ఇన్సూరెన్స్ లేకపోయినా, తక్కువ ఇన్సూరెన్స్ ఉన్నా కూడా ఈ టీకాలు (Flue Shots) వేస్తామన్నారు. టీకా వేసుకుంటే ఫ్లూ నుంచి రక్షణ లభిస్తుందని, కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోవద్దని సూచించారు. టామా (TAMA) ప్రెసిడెంట్ రూపేంద్ర వేములపల్లి, చైర్మన్ రాఘవ తడవర్తి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతోంది.













