ప్రధాని మోదీకి ఘన స్వాగతం
ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మెలానియా దంపతులు శ్వేతసౌధ్యంలో సాదర స్వాగతం పలికారు. భారత కాలామానం ప్రకారం సోమవారం అర్థరాత్రి దాటాక 1:15 గంటలప్పుడు వైట్‌హౌస్‌కు చేరుకున్న మోదీతో ట్రంప్ కరచాలనం చేసి లోపలకు ఆహ్వానించారు. ఉత్సాహపూరిత వాతావరణంలో ఇరువురు నాయకులూ నవ్వుతూ మాట్లాడుకున్నారు. తనకు సాదర స్వాగతం పలకడంపై అధ్యక్షుడికి ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. వారి ముఖాముఖి భేటీకి ఓవల్ ఆఫీస్ వేదిక అయ్యింది. అమెరికా పర్యటనలో ప్రధాని వెంట జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, విదేశాంగ కార్యదర్శి ఎస్.జయశంకర్ తదితరులు ఉన్నారు.













