ట్రంప్ టవర్‌లో అగ్ని ప్రమాదం
న్యూయార్క్‌లోని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాపార సంస్థ భవనం ట్రంప్ టవర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. న్యూయార్క్ అగ్నిమాప దళం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో న్యూయార్క్‌లోని మిడ్‌టౌన్ ఏరియాలోని ట్రంప్ టవర్ భవనంలోని చివరి అంతస్థుపైన ఉన్న కూలింగ్ టవర్ అగ్ని ప్రమాదానికి గురి అయినట్లు తెలిపారు. పరిస్థితి అదుపులో ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ ప్రమాద కారణాలపై పూర్తి వివరాలు సేకరించాల్సి ఉందని స్థానిక పోలీసులు తెలిపారు. అయితే ఎలక్ట్రికల్ వైర్లు కాలిపోవటంతో ప్రమాదం సంభవించి ఉండవచ్చని ట్రంప్ కుమారుడు ఎరిక్ ట్రంప్ ట్విట్టర్లో ప్రమాదంపై వివరాలు ఇస్తూ ట్వీట్ చేసారు.













