భారీగా తగ్గిన జుకర్ బర్గ్ సంపద
ఫేస్బుక్ మార్కెట్ క్యాప్ తగ్గింది. అలాగే సంస్థ అధినేత మార్క్ జుకర్ బర్గ్ సంపద 82 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఆయన ప్రపంచ కుబేరుల ర్యాంకులో నాల్గో స్థానానికి పడిపోయాడు. వర్ణ వివక్ష, విద్వేషంతో కూడిన వ్యాఖ్యలు నిలువరించేందుకు చర్యలు తీసుకుంటామని జుకర్ బర్గ్ తెలిపారు. తాను ప్రకటించే విధానాల్లో రాజకీయ నాయకులకు కూడా మినహాయింపు ఉండదన్నారు. అమెరికాలో ఫ్లాయిడ్ మృతి అనంతరుం సోషల్ మీడియాలో విద్వేషపూరిత సమాచారానికి వ్యతిరేకంగా మానవ హక్కుల సంఘాలు ఉద్యమం ప్రారంభించాయి. ప్రమాదకర ప్రకటనల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవడం ఆపివేయాలని డిమాండ్ చేశాయి. అందుకే ఈ ఉద్యమానికి స్టాప్ హేట్ ఫర్ ప్రాఫిట్ అని పేరు పెట్టారు.













