కరోనా సోకిన ఆసుపత్రికి వెళ్లే అవసరం రాదు
కరోనా సోకినా ఆసుపత్రికి వెళ్లే అవసరం లేకుండా, ఇంటిలోనే ఉంటూ చికిత్స తీసుకునే రోజులు త్వరలో రానున్నాయని అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ వ్యాఖ్యానించారు. ఫేస్బుక్ ఫౌండర్ చీఫ్ మార్క్ జుకర్‌బర్గ్‌తో లైవ్‌లో జరిగిన ఆన్లైన్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ నాటికి కరోనాపై కచ్చితమైన తూటాల్లా పని చేసే ఔషధాలను అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయని సూచించారు. మోనోక్లోనల్ యాంటీ బాడీలపై ప్రస్తుతం ప్రయోగాలు జరుగుతున్నాయని ఫౌచీ తెలియజేశారు. తుటాల వంటి వీటిని నరం ద్వారా రోగీ శరీరంలోకి పంపించవలసి ఉంటుందని, ఇవి అద్భుత పని తీరును చూపిస్తాయని అభిప్రాయపడ్డారు. శరీరంలో కరోనా తీవ్రత ఏస్థాయిలో ఉన్నా ఆసుపత్రికి వెళ్లకుండా చేసే ఔషధాలు మార్కెట్లోకి వచ్చేంత తరకు ప్రజలే తగు జాగ్రత్తలతో ఉండాలని సూచించారు. యువత అజాగ్రత్త కారణంగా వారే ఎక్కువగా వైరస్ బారిన పడుతున్నారని అభిప్రాయపడిన ఆంటోనీ ఫౌచీ భౌతిక దూరం పాటించడం, మిగతా అన్ని జాగ్రత్తలూ తీసుకోవడాన్ని ఓ బాధ్యతగా భావించాలని సూచించారు.













