సీటెల్ ఆధారంగా ఇండియన్ అమెరికన్ ఎగ్జిక్యూటివ్ అరెస్ట్
పేచెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ కి సంబంధించి నకిలీ పత్రాలలి సృష్టించి కోవిడ్ -19 PPP రిలీఫ్ కార్యక్రమం ద్వారా 5.5 మిలియన్ డాలర్లకు పైగా నిధులు అపహరించాడని సీటెల్ ఆధారంగా అధికారులు ఆరోపిస్తూ ముకుంద్ మోహన్ భారతీయ అమెరికన్ పారిశ్రామిక వేత్త మరియు అమెజాన్ మరియు మైక్రోసాఫ్ట్ మాజీ ఎగ్జిక్యూటివ్ ని జూలై 23 న అరెస్టు చేశారు. యు.ఎస్. అటార్నీ కార్యాలయం నివేదిక ప్రకారం, కరోనా వైరస్ సంక్షోభ సమయంలో మోహన్ తన వ్యాపారాలను కార్మికులను నిలబెట్టడానికి ఫెడరల్ పిపిపి రుణాలు ఉద్దేశించడం జరిగింది కానీ మోహన్ కంపెనీలు ఒక్క కార్మికుడిని కూడా నియమించలేదు అని నివేదిక లో పేర్కొంది.
పీపుల్స్ బ్యాంక్ కు $ 431,250 PPP ఋణం ద్వారా 24 మంది ఉద్యోగస్థులని నిలబెడుతుంది అని మోహన్ పేర్కొన్నాడు. బిజినెస్ లైసెన్స్ లేని మరియు ఉద్యోగుల వేతనాలు లేదా పేరోల్ పన్నులను ఎప్పుడూ చెల్లించని జిగాంటిక్ ఎల్ఎల్సి అనే మరో సంస్థకు మోహన్ పిపిపి రుణాల ద్వార $304,830 అందుకున్నాడు. మొత్తం గా 5.5 మిలియన్ డాలర్ల పైగానే మోసం చేసినట్టు యు.ఎస్. అటార్నీ కార్యాలయం పేర్కొన్నట్లు ఇండియా-వెస్ట్ తెలిపింది.
మైసూర్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ చదివి, సీటెల్‌లోని మైక్రోసాఫ్ట్‌లో ఇంజనీరింగ్ డైరెక్టర్ అయిన మోహన్, బెంగళూరులోని స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో బాగా ప్రాచుర్యం పొందాడు. అతను ప్రస్తుతం ఆన్లైన్ కెనడియన్ నిర్మాణ సామగ్రి రిటైలర్ బిల్డ్‌డైరెక్ట్.కామ్‌లో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు.













