ఎనర్జీ డ్రింక్స్ తో గుండెకు ముప్పు!
ఎనర్జీ డ్రింక్స్ శరీరానికి ఉత్తేజాన్నిస్తాయి. అయితే వీటిని ఎప్పుడో ఒకటి తాగితే ఫర్యాలేదు కానీ తరచుగా సేవించడం వల్ల రక్తపోటు విపరీతంగా పెరిగిపోయి హృదయ స్పందనల్లో హెచ్చుతగ్గులు వచ్చే ప్రమాదం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. 18 నుంచి 40 ఏళ్ల వయసు గల 34 మందిపై అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ పసిఫిక్ పరిశోధకులు ఒక అధ్యయనం చేశారు. మూడు రోజుల వ్యవధిలో 304 నుంచి 320 గ్రాముల కెఫైన్ కలిగిన 32 ఔన్స్ (946 మిల్లీలీటర్ల) ఎనర్జీ డ్రింక్స్‌ను వారితో తాగించారు. దీనివల్ల నాలుగు గంటల్లో హృదయ స్పందనలు (క్యూటీ ఇంటర్వెల్) 6 మిల్లీ సెకన్ల నుంచి, 7.7 మిల్లీ సెకన్లు పెరిగినట్లు గుర్తించారు.













