యూఎస్ మార్కెట్లోకి రెడ్డీస్ జనరిక్ జి ప్రాసిడోన్ మెసైలేట్
అమెరికా విపణిలో జెనరి జి ప్రాసిడోన్ మెసైలేట్ను డా.రెడ్డీస్ విడుదల చేసింది. మనోవైకల్వంతో బాధపడుతున్న రోగులకు ఈ ఔషధాన్ని వాడతారని వెల్లడించింది. 20 ఎంజీ/ ఎంఎల్ సింగిల్ డోస్ ఇంజెక్షన్‌ను విడుదల చేసినట్టు తెలిపింది. అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ యూఎస్ఎఫ్డీఏ ఆమోదం పొందిన తర్వాత ఈ ఔషధాన్ని విడుదల చేసినట్టు వివరించింది. ఈ ఉత్పత్తి పిజర్కు చెందిన జియాడన్ ఇంజెక్షన్ జెనరిక్ వెర్షన్ అని వివరించింది. ఇదిలావుండగా బీఎస్ఈలో డాక్టర్ రెడ్డీస్ లేబరేటరీస్ షేర్లు మంగళవారం 1.25 శాతం పతనమయ్యాయి. ఒక్కో షేరు ధర రూ.2,791.15గా ఉంది.













