ప్లాస్మా చికిత్సకు అమెరికా ఓకే…
అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ప్లాస్మా చికిత్సకు ఓకే చెప్పింది. కరోనా వైరస్‌తో బాధపడుత్ను రోగులకు ఈ చికిత్సను అందిచనున్నారు. ఈ విషయాన్ని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. యాంటీబాడీలు అధికంగా ఉండే బ్లడ్ప్లాస్మాను ఈ టెక్నిక్‌లో వినియోగిస్తారు. వ్యాధి నుంచి కోలుకున్న వారి నుంచి తీసిన ప్లాస్మాను కోవిడ్ రోగులకు ఇవ్వనున్నారు. అమెరికాలో ఈ పద్ధతిలో ఇప్పటికే 70 వేల మందికి చికిత్స చేసినట్లు తెలుస్తోంది. ఈ చికిత్స విధానం వల్ల దేశంలో మరణాలను 35 శాతం తగ్గించవచ్చు అని అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. వ్యాక్సిన్లను, మందులను రిలీజ్ చేయడంలో ఎఫ్‌డీఏ జాప్యం చేస్తున్నట్లు ట్రంప్ ఆరోపించిన కొన్ని రోజులకే కొత్త విధానానికి గ్రీన్ సిగ్నల్ దొరికింది. రిపబ్లికన్ పార్టీ జాతీయ సమావేశాల నేపథ్యంలో ట్రంప్ ఈ ప్రకటన చేశారు.
చైనా వైరస్‌పై పోరులో చరిత్రాత్మక ప్రకటన చేస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. కన్వల్ సెంటర్ ప్లాస్మా చికిత్సా విధానం వల్ల లెక్కలేనని జీవితాలను కాపాడవచ్చు అని ఆయన అన్నారు. ప్లాస్మా విధానం చాలా శక్తివంతమైన చికిత్స అని, అయితే కోవిడ్ 19 నుంచి కోలుకున్న అమెరికన్లు తమ ప్లాస్మాను దానం చేసేందుకు ముందుకు రావాలని ట్రంప్ కోరారు.













