కిమ్-ట్రంప్ మెనూ తెలుసా?
సింగపూర్‌లో కిమ్-ట్రంప్ వర్కింగ్ లంచ్ ఇరుదేశాధినేతల అభిరుచులను తెలియజేసింది. షడ్రసోపేతమైన భోజనాన్ని ఏర్పాటు చేశారు. వీరి కోసం ఏర్పాటు చేసిన సిక్స్ కోర్స్ మీల్ లో మూడు డిజర్ట్స్ కూడా ఉన్నాయి. ఈ భోజనంలో హేగన్ డాజ్స్ వెనిల్లా ఐస్‌క్రీమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇరు దేశాల నేతలు డైట్‌ను పక్కన పెట్టి విందును ఆస్వాదించారు. ఇరు దేశాల నేతలకు సంప్రదాయ రొయ్యల కాక్టెయిల్తోపాటు అవకాడో సలాడ్, పచ్చిమామిడితో చేసిన కెర్బూ, మలేషియాకు చెందిన రైస్ వంటకం, తేనె, నిమ్మకాయలతో అలంకరించిన ఆక్టోపస్లతోపాటు కొరియన్ స్టప్డ్ కూకుంబర్ (దోసకాయ)ను, గొర్రె మాంసంతోపాటు, బ్రకొలీ, రెడ్‌వైన్, స్వీట్ అండ్ సోర్ క్రిస్పీ పోర్క్ యంజూహు ఫ్రైడ్ రైస్, కాడ్‌ఫిష్-రాడిష్లు ఉన్నాయి. ఇక డిజర్ట్ల్లో డార్క్ చాక్లెట్ టార్టల్ గ్రెంచి, చెర్రీలతో అలంకరించిన హేగన్ డాజ్స్ వెనిల్లా ఐస్క్రీమ, ట్రోపిజెన్నీ అనే ఫ్రెంచి పేస్ట్రీని వడ్డించారు.













