ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల కల్పనకు ఎన్నారైల సహాయం – జయరామ్ కోమటి
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాల కల్పనకు, డీజిటల్ తరగతుల ఏర్పాటుకు ఎన్నారైలు ముందుకు వస్తున్నారని అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న జయరామ్ కోమటి అన్నారు. ఎన్నారైలు నల్లమోతు మహేష్, మద్దినేని భరత్ సహకారంతో మండల కేంద్రమైన నాదెండ్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో డిజిటల్ తరగతులను ఏర్పాటు చేశారు. ఈ తరగతి గదిని పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రతిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు కార్పొరేట్‌కు ధీటుగా సాంకేతిక పరిజ్ఞానంతో విద్యా భోదన చేయిస్తున్నామని, దీని కోసం విద్యా శాఖకు బడ్జెట్లో అధిక నిధులు కేటాయించారని చెప్పారు. జన్మభూమి అభివృద్ధిలో ప్రవాసాంధ్రులను భాగస్వాములను చేస్తున్నామన్నారు. ప్రారంభోత్సవ వేడుకల తరువాత దాతలు నల్ల మోతు మహేష్, మద్ధినేని భరత్ తల్లి దండ్రులను ఘనంగా సన్మానించారు.













