2021 నాటికి తీవ్ర పేదరికం…
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వచ్చే 2021 నాటికి ప్రపంచంలో 15 కోట్లమంది తీవ్ర పేదరికానికి గురయ్యే అవకాశముందని ప్రపంచబ్యాంక్ హెచ్చరించింది. కొత్త వ్యాపారాలు, కొత్త రంగాల్లో శ్రమ, నైపుణ్యాలు, ఆవిష్కరణలకు అవకాశాలు కల్పించడం ద్వారా కొవిడ్ తర్వాత విభన్నమైన ఆర్థిక వ్యవస్థ కోసం దేశాలు సిద్ధం కావాలని కోరింది. వైరస్ ఈ ఏడాది అదనంగా 8 కోట్ల 80 లక్షల నుంచి 11 కోట్ల 50 లక్షల మందిని తీవ్ర పేదరికంలోకి నెట్టివేస్తుందని కూడా అంచనా వేసింది. భారత్ లో డేటా అందుబాటులో లేనందువల్ల పేదరికాన్ని అంచనావేయడానికి అడ్డంకులు ఏర్పడినట్టు నివేదికలో సృష్టం చేసింది.













