విజేతలకు టాయిలెట్ పేపర్
కరోనా కారణంగా అమెరికాలో టాయిలెట్ పేపర్లకు ఎంత డిమాండ్ ఏర్పడిందో తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న మహిళల గోల్ఫ్ లీగ్‌లో విజేతకు నగదుతో పాటు టాయిలెట్ పేపర్ రోల్‌ను బహుమతిగా ఇస్తున్నారు. ఒకవైపు కరోనా కలవరపెడుతున్నప్పటికీ అరిజోనా క్లబ్లో ఆరంభమైన ఈ లీగ్‌లో ముందస్తు జాగ్రత్తలతో పోటీలను నిర్వహిస్తున్నారు. గత వారం జరిగిన పోటీల్లో విజేతగా నిలిచాను. టాయిలెట్ పేపర్ బహుమతిగా ఇవ్వడం ఆశ్చర్యం కలిగించింది. గుంతల్లో సబ్బు నురగను నింపుతున్నారు దీని వల్ల బంతిని సురక్షితంగా తీసుకుంటున్నాం అని ఈ లీగ్‌లో ఓ అంచె విజేత సారా తెలిపింది.













