అక్టోబర్ కల్లా వ్యాక్సిన్ !
కరోనా వైరస్‌ను అంతం చేసేందుకు వ్యాక్సిన్ తయారీలో ఆక్స్ఫర్డ్ వర్సిటీ పరిశోధకులు నిమగ్నమయ్యారు. అయితే అక్టోబర్ నాటికి పూర్తి స్థాయి వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని యూనివర్సిటీలోని వ్యాక్సినాలజీ ప్రొఫెసర్ సార్హా గిల్బర్ట్ తెలిపారు. 18 నుంచి 55 ఏళ్ల మధ్య ఉన్న వారిపై క్లినికల్ ట్రయల్స్‌కు సిద్దమైనట్టు వివరించారు. 500 మందిపై దీన్ని ప్రయోగించనున్నట్టు ఆమె తెలిపింది. 1994 లో తాను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో వ్యాక్సిన్‌పై అధ్యయనం ప్రారంభించామన్నారు. తనకు యూకే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ రీసెర్చ్, యూకే రీసెర్చ్ నుంచి 2.8 మిలియన్ డాలర్ల గ్రాండ్ అందుకున్నట్టు తెలిపింది. రోగ నిరోధక శక్తి పెంచే విధంగా క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయని వివరించారు. ఇతర దేశాలతో కలిసి ముందుకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా కలిసి ట్రయల్స్ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు గిల్బర్ట్ తెలిపారు. వ్యక్తి శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచుతూనే కరోనా వైరస్‌ను అంతం చేసేలా వ్యాక్సిన్ ఉంటుందని వివరించారు.













