ఇళ్ల వద్దే పరీక్ష చేసే కరోనా కిట్!
అమెరికాలో ఇళ్ల వద్దే కరోనా పరీక్షలు నిర్వహించేందుకు మార్గం సుగమమైంది. అందుకు అనువైన కొవిడ్ 19 నిర్థారణ కిట్ వినియోగానికి ఆ దేశానికి చెందిన ఎఫ్‌డీఏ పచ్చజెండా ఊపింది. దీని ధర రూ.9వేలు. వైద్య నిపుణుడి సిఫారసు మేరకు కరోనా పరీక్ష చేయించుకోదల్చిన వ్యక్తి ఇంటికి ఈ కిట్‌ను ఆరోగ్య సిబ్బంది తీసుకెళ్తారు. కొవిడ్ 19 అనుమానిత లక్షణాల వివరాలతో కూడిన ప్రశ్నావళిని భర్తీ చేయించి, ముక్కు, గొంతులోని స్రావాల శాంపిళ్లను సేకరిస్తారు. అనంతరం కిట్‌ను సంబంధిత వైద్య నిపుణుడికి అప్పగిస్తారు. అతడు శాంపిల్‌ను విశ్లేషించిన తర్వాత కొవిడ్ 19 పరీక్ష నివేదికను ఇంటికి పంపుతాడు.













