అమెరికాలో 2.15 లక్షల కరోనా కేసులు
ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఇన్ఫెక్షన్ కేసులు గురువారం నాటికి 9,38,000కు చేరుకోగా, దాదాపు 1,94 వేల మంది కోలుకున్నారనీ, 47,235 మంది చనిపోయారని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ తాజా లెక్కలు చెబుతున్నాయి. అమెరికాలో గురువారం నాటికి కరోనా కేసులు 2,15,000కు పైగా నమోదు కాగా, గురువారం 884 మంది మరణించారు. దీనితో అమెరికాలో మొత్తం మరణాల సంఖ్య 5,119కి చేరింది. అమెరికాలోనే అత్యధికంగా న్యూయార్క్ రాష్ట్రంలో 83 వేల కేసులు నమోదు కాగా, 2,219 మంది మరణించినట్టు తెలుస్తోంది. స్పెయిన్లో గురువారం నమోదయిన 950 మరణాలతో మొత్తం కరోనా మృతుల సంఖ్య పదివేలు దాటింది. బ్రిటన్లో గురువారం నాడు 563 కరోనా మరణాలు నమోదయ్యాయి.













