సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు చైనాయే కారణం : పాంపియో
అమెరికి విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తన అక్కసునంతా వెళ్లగక్కారు. సరిహద్దుల్లో ఉద్రికత్తలకు చైనాయే అజ్యం పోస్తోందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నాటో వంటి సంస్థల ద్వారా ప్రపంచం సాధించిన పురోగతిని నాశనం చేసి, చైనాకు అనుగుణంగా ఉండే కొత్త నియమ నిబంధనలను తీసుకురావాలని చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అంతటితో ఆగకుండా చైనా కమ్యూనిస్టు పార్టీని దుష్ట శక్తి (రోగ్ యాక్టర్) అంటూ నిందించారు. భారత్తో సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు చైనా సన్యమే కారణమన్నారు. శుక్రవారం జరిగిన కోపెన్ హాగన్ డెమోక్రసీ సమ్మిట్ 2020 సందర్భంగా పాంపియో యూరప్ అండ్ చైనా ఛాలెంజ్ అనే అంశంపై వర్చువల్ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన చైనాపైన, చైనా కమ్యూనిస్టు పార్టీపైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.













