కోవిడ్ విపత్తు…చికాగో ఫ్రెండ్స్ సేవలు
అమెరికాలో ఇతర చోట్ల విజృంభిస్తున్న కోవిడ్ 19 వైరస్‌ను ఎదుర్కొవడంలో సీనియర్ సిటిజన్లకు ఇతరులకు చేయూతనిచ్చేందుకు చికాగోలోని ఇండియన్ కమ్యూనిటీ ముందుకు వచ్చింది. అందరం కలిసికట్టుగా ఉంటే ఈ విపత్తును సులభంగా ఎదుర్కోవచ్చని కమ్యూనిటీ నాయకులు తెలిపారు. సీనియర్ సిటిజన్లకు అవసరమైన ఫుడ్, ఇతర వస్తువులను గ్రాసరీ స్టోర్ల నుంచి కొనుగోలు చేయడంలో సహాయపడేందుకు, హాస్పిటల్ ఇతర సేవలకు చేయూతనిచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చికాగోలోని చాందిని దువ్వూరి, హేమ కానూరు, కృష్ణ మోహన్ తెలిపారు. మెడిటేషన్ చేయడం ద్వారా శ్వాస ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందవచ్చని వారు చెబుతూ, ఇందుకోసం అవసరమైన వారికి మెడిటేషన్ సేవలను అందించనున్నట్లు వారు చెప్పారు. ఎవరైనా ఇలాంటి సేవలను అందించేందుకు వలంటీర్‌గా ముందుకు రావాలని కూడా వారు కోరారు. సహాయం కావాల్సినవారు తమను ఈ ఫోన్ నెంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు. చాందిని దువ్వూరి 630 936 8561, హేమ కానూరు 630 532 3339, కృష్ణ మోహన్ 916 612 8304కు ఫోన్ చేయవచ్చు.













