సియాటెల్ డిప్యూటీ మేయర్‌గా చెన్నై మహిళ
భారతీయ మహిళకు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. ప్రవాస చెన్నై మహిళ షిఫాలీ రంగనాథన్ (38) అమెరికా లోని ప్రఖ్యాత నగరం సియాటెల్ డిప్యూటీ మేయర్‌గా ఎంపికైంది. రవాణ విభాగంలో రాణించడంతో ఆమెలోని నాయకత్వ లక్షణాలను గుర్తించిన సియాటెల్ మేయర్ జెన్నీ డెర్కన్ గత టీమ్‌లో చేర్చుకుని డిప్యూటీ మేయర్‌గా నియమించారు. చిన్నతనం నుంచి షిఫాలి చురుకైన వ్యక్తి అని, చదవులోనూ, ఎంచుకున్న వృత్తిలోనూ ముందుందేడని ఆమె తండ్రి ప్రదీప్‌రంగనాథన్ తెలిపారు. ఆయన 2001లో కుటుంబంతో సహా అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. చిన్నతనంలో చెన్నైలోని నూగంబాక్కంలో షిఫాలి స్కూలింగ్ సాగింది. స్టెల్లా మేరీస్ కాలేజీలో బీఎస్సీ పూర్తి చేయగా, అన్నావర్సిటీ నుంచి ఎన్విరాన్మెంట్ సైన్స్‌లో గోల్డ్‌మెడలిస్ట్.













