జాన్సన్ అండ్ జాన్సన్ కు భారత్ షాక్
అమెరికాకు చెందిన సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్‌కు భారత్‌లో షాక్ తగిలింది. రాజస్థాన్‌లో నిర్వహించిన నాణ్యతా పరీక్షల్లో జాన్సన్ అండ్ జాన్సన్ షాంపూ విఫలమైంది. ఈ షాంపు భారత ప్రమాణాలను అందుకోలేకపోయింది. ఈ మేరకు రాజస్థాన్ డ్రగ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ జాన్సన్ అండ్ జాన్సక్కు మార్చి 5న నోటీసులు జారీ చేసింది. కంపెనీ బేబీ షాంపూ రెండు బ్యాచ్‌ల నమూనాల పరీక్షల్లో షాంపూలో హానికారక పదార్థాలు ఉన్నాయని నిర్థారించింది. ఈ శాంపిల్స్‌లో ప్రమాదకర ఫార్మల్ డిహైడ్ ఉన్నాయని, ఈ డిహైడ్ను భవన నిర్మాణ సామగ్రి (కార్సినోజెన్) తయారీలో ఉపయోగిస్తారని ఆ సంస్థ పేర్కొంది. అయితే జాన్సన్ అండ్ జాన్సన్ షాంపూ సురక్షితమైందని, అన్ని ప్రమాణాలు పాటిస్తున్నామంటూ ఆరోపణలను ప్రతినిధి తిరస్కరించారు. అయితే జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థపై ప్రపంచ వ్యాప్తంగా వేలాది కేసులు విచారణలో ఉన్నాయి.













