అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాను
అగ్రరాజ్యం అమెరికాను మంచు తుఫాను వణికిస్తోంది. రాకీ పర్వతాల నుంచి భారీగా వీస్తున్న చలిగాలుల ధాటికి 25 రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించిపోయింది. గంటకు 148 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఆ గాలుల వల్ల కోలరాడో, నేబ్రస్కా డకోటాలోని ప్రధాన రహదారుల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. హిమపాతం కారణంగా వేల సంఖ్యలో విమనాలు రద్దయ్యాయి. స్కూళ్లు, వ్యాపారాలు మూతపడ్డాయి. ఇక కొన్ని చోట్ల హిమపాతంతో పాటు పిడుగులు పడుతుండటంతో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచి పోయింది. ఫలితంగా కొన్ని లక్షల కుటుంబాలు చీకిటిలో ఉన్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో మంచు తుఫానుపై అధికారికి హెచ్చరికలు జారీ అయ్యాయి.
తాజా తుఫానును బాంబ్ తుఫానుగా వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. రోడ్లపై మంచు పేరుకుపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల వాహనాలు జారిపోవడం ఒకదానితో మరోకటి డీకోన్న ఘటనలు చోటుచేసుకున్నాయి. హిమపాతం కారణంగా కొలరాడోలోని డెన్వర్ ఎయిర్ పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. విమానాల రాకపోకలను నిలిపివేశారు. దీంతో 1339 విమాన సర్వీసులు రద్దయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు కూలిపోవడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టార. శిథిలాల నుంచి ప్రజలను రక్షించి ఆసుపత్రికి తరలించారు. తుఫాను కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉండటంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు. న్యూమెక్కికోలో వీచిన బలమైన గాలులకు ఒక రైలుకు చెందిన 26 బోగీలు వంతెనపై నుంచి పడిపోయాయి.













