పాక్‌కు అమెరికా గట్టి షాక్
పాకిస్థాన్‌కు అమెరికా గట్టి షాక్ ఇవ్వనుంది. పాకిస్థాన్‌ను నాటో (ఎంఎన్ఎన్ఏ) మిత్ర దేశంలో హోదా నుంచి ఉపసంహరిచే బిల్లును అమెరికా పార్లమెంట్ ముందుకు తీసుకురాబోతోంది. ఉగ్రవాదంపై చిత్తశుద్ధితో పోరాటం చేయడంలో పాకిస్థాన్ విఫలమైందని అమెరికా ప్రతినిధుల సభలోని ఇద్దరు ప్రధాన సభ్యులు పేర్కొన్నారు. ఈ బిల్లును రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు టెడో పొ, డెమొక్రాటిక్ సభ్యుడు రిక్ నోలన్ ప్రవేశపెట్టనున్నారు. ఎంఎన్ఎన్ఏలో పాకిస్థాన్‌కు 2004లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ సభ్యత్వం కల్పించారు. ఆల్‌ఖైదాను రూపుమాపేందుకు అప్పట్లో ఆయన పాకిస్థాన్‌కు ఈ హోదా కల్పించారు.













