భారతీయుల కోసం బాలీవుడ్ పాట రీమిక్స్
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారతీయ అమెరికన్ ఓటర్లను ఆకట్టుకునేందుకు డెమోక్రటిక్ పార్టీ నేతలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. తమ పార్టీ తరపున అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న జో బైడెన్‌కు, ఉపాధ్యక్ష పదవికి బరిలో నిలిచిన కమలా హారిస్‌కు ఓటెయ్యాలని కోరుతూ.. సూపర్ హిట్ బాలీవుడ్ సినిమా లగాన్ లోని చలే చలో పాట వీడియో రీమిక్స్‌ను తాజాగా వారు విడుదల చేశారు. చలే చలో, చలే చలో, జైడెన్ కో ఓట్ దో, బైడన్ కీ జీత్ హో, ఉన్కీ హార్ హా అంటూ సాగే ఈ పాటను సిలికాన్ వ్యాలీలో ఉంటున్న బాలీవుడ్ సింగర్ టిట్లీ బెనర్జీ ఆలపించారు. డెమోక్రటిక్ నేతలు, వ్యాపారవేత్తలు అయిన అజయ్, వినితా భుటోరియా దంపతులు దాన్ని విడుదల చేశారు. ఈ ఏడాది నవంబరు 3న అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు జరగనున్నాయి.













