వాషింగ్టన్ డీసి లో ఆటా అన్నదానం
అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) సేవా కార్యక్రమాల్లో భాగంగా ఆటా వాషింగ్టన్‌డీసి నాయకులు గుడ్ షెపర్డ్ అలయన్స్ తో కలిసి లౌడన్కౌంటీలో ఉన్న గూడులేని నిరుపేదలకు అన్నదానం చేశారు. దాదాపు 180కిపైగా వ్యక్తులకు, కుటుంబాలకు అన్నదానం చేశారు. గుడ్‌షెపర్డ్ అలయన్స్‌తో కలిసి ఆటా ఇక ముందు కూడా వీకెండ్లో ఫుడ్ స్పాన్సర్ చేస్తుందని ఆటా నాయకులు తెలిపారు. ఈ వారం ఫుడ్‌ను కౌశిక్ శర్మ, రోహిణి చల్లా స్పాన్సర్ చేశారు. ప్రెసిడెంట్ ఎలక్ట్ భువనేష్ బూజాల, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ జయంత్ చల్లా, రామ్మోహన్ సూరినేని, అమర్ బొజ్జా, రీజినల్ కో ఆర్డినేటర్ సుధీర్ బండారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.






