ఈ సమయంలో యుఎస్ ఓపెనా?
కరోనా మహమ్మారి తీవ్రమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో యుఎస్ ఓపెన్ నిర్వహించడానికి సిద్ధం అవుతుండడంపై మహిళల ప్రపంచ నం.1 ఆష్లె బార్టీ (ఆస్ట్రేలియా) ఆందోళన వ్యక్తం చేసింది. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 31న యుఎస్ ఓపెన్ ఆరంభం కావాలి. అమెరికాలో ఈ టోర్నీ నిర్వహణపై జకోవిచ్, నాదల్ సహా చాలామంది టెన్నిస్ ఆటగాళ్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. కరోనా పరీక్షల్లో నెగటివ్‌గా వచ్చిన టెన్నిస్ క్రీడాకారులను ప్రత్యేక విమానాల్లో తీసుకొచ్చి టోర్నీని షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలన్నది ప్రతిపాదన. దీనిపై ఒక వారంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. కరోనా నేపథ్యంలో ఇప్పటికే వింబుల్డన్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీలు ఆగిపోయాయి. యుఎస్ ఓపెన్ అయినా నిర్వహించాలని తపన పడడంతో అర్థం ఉంది. కానీ క్రీడాకారుల భద్రతకే ప్రధమ ప్రాథన్యం ఇవ్వాలని బార్టీ పేర్కొంది.













