గే కావడం నాకు దేవుడు ఇచ్చిన వరం
స్వలింగ సంపర్కుడిని కావడం దేవుడు తనకిచ్చిన గొప్ప వరమని యాపిల్ కంపెనీ సీఈవో టిమ్ కుక్ పేర్కొన్నారు. తనకు దక్కిన ఈ ప్రత్యేకతపై చాలా సంతోషంగా ఉన్నానన్నారు. తాను స్వలింగ సంపర్కుడినంటూ 2014 అక్టోబర్ 30న కుక్ స్యయంగా ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. అతిపెద్ద కంపెనీకి అధిపతిగా ఉన్న ఓ వ్యక్తి గే గా ప్రకటించుకోవడం ఇదే తొలిసారి. ఆయన స్వలింగ సంపర్కుడంటూ చాలా ఏళ్ల క్రితం నుంచే పుకార్లు వచ్చినప్పటికీ, కుక్ ఎప్పుడూ బహిరంగంగా ఒప్పుకోలేదు. తాజాగా తాను అప్పట్లో తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సంతోషంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు.













