ఎపి జన్మభూమి ఆధ్వర్యంలో అట్లాంటాలో మీట్ అండ్ గ్రీట్
అట్లాంటాలో ఏపి జన్మభూమి ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని అక్టోబర్ 27వ తేదీన ఏర్పాటు చేశారు. ఎపి జన్మభూమి తరపున ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన పనులపై ఇందులో వివరిస్తారు. ప్రభుత్వ స్కూళ్ళలో డిజిటల్ తరగతుల ఏర్పాటు, అంగన్వాడీ కేంద్రాలకు భవనాల నిర్మాణం, శ్మశానవాటికల అభివృద్ధి వంటి విషయాలపై అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న జయరామ్ కోమటి తెలియజేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు హాజరవుతున్నారు. ఎపి హయ్యర్ ఎడ్యుకేషన్ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అట్లాంటాలోని చెన్నై ఎక్స్ప్రెస్ బాంక్వెట్హాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని ఈ కార్యక్రమానికి అందరూ రావాలని తానా నాయకుడు అంజయ్యచౌదరి లావు పిలుపునిచ్చారు.













