కరోనా తర్వాత మరో ప్రపంచం!
యుగాంతం వచ్చిందా
అగ్రరాజ్యమైన అమెరికాలో అల్లకల్లోలం
ఉన్నది అంతా డిజిటల్ యుగమే
కొత్త ట్రెండ్ గేమిఫికేషన్ కి మంచి డిమాండ్
ఆన్లైన్ ఎడ్యుకేషన్ లో కొత్త ట్రెండ్
ఒక సూక్ష్మ జీవి మనిషి మనుగడ సాగిస్తుందని మూడు నెలల క్రితం వరకు ఎవరు అనుకోని ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు చూస్తే యుగాంతం వచ్చిందా అనిపించకమానదు. గత మూడు దశాబ్దాల్లో శరవేగంగా ఎదిగిన చైనాలో మొదలైన ఈ భూమండలం అగ్రరాజ్యంగా ఉన్నా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచానికి ఎదురైన అతి పెద్ద సవాల్ అని చెప్పక తప్పదు. ఓరకంగా ఇది మూడో ప్రపంచ యుద్ధం. గేమ్స్, ఆన్లైన్ బ్యాంకింగ్ ఇలా ఒకటేమిటి ఆన్లైన్ లో నిర్వహించాల్సిన పరిస్థితి వస్తోంది. ఆన్లైన్ ఎడ్యుకేషన్ లో కొత్త ట్రెండ్ కు మంచి డిమాండ్ రాబోతోంది. పిల్లలు ఆసక్తి రేకెత్తించే కొత్త ట్రెండ్ గేమిఫికేషన్ కి మంచి డిమాండ్ రాబోతోంది.
చరిత్రలో పాఠాలుగా మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలను తెలుసుకున్న వారికి మూడో ప్రపంచ మూడో ప్రపంచ ఎప్పుడు వస్తుంది? ఎలా వస్తుంది? అన్న సందేహం ఉంటుంది. అలాంటి వారికి సమాధానం చెప్పాలంటే మూడో ప్రపంచ యుద్ధం ఇదే. కాకపోతే మొదటి రెండు ప్రపంచ యుద్ధాలు దేశాల మధ్య సైన్యం చేసిన పోరాటాలు అయితే ఇది కంటికి కనిపించని వైరస్ మీద అన్న దేశాల ఎవరికి వారు చేస్తున్న యుద్ధం. మానవ జాతి మొత్తం ఇప్పుడు ఈ యుద్ధంలో తలమునకలై ఉంది. ఏదో ఒక రోజున దీని నుంచి బయటపడ్డాం. ఆరు నెలలకు.. సంవత్సరానికో.. కానీ ఆ తర్వాత ఈ ప్రపంచంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. మనిషి ఆలోచనా ధోరణి పూర్తిగా కొత్తదనాన్ని సంతరించుకుంటుంది. బతికి బట్టకట్టడం ఎలా.. అనేది ప్రతి మనిషి మనసు తొలిచేస్తుంది. లోపల భయం ఉంటుంది. జాగ్రత్త పెరుగుతుంది. అదే మనిషి జీవన విధానంలో మార్పు తీసుకువస్తుంది. మనుషులు తీరుతెన్నులను బట్టే వ్యాపారాలు కదా? అందుకే వ్యాపారాల్లో సమూలమైన మార్పులు సంభవిస్తాయి. ఇప్పుడు మనం చూసే, కళ్ళలో కనిపించే వ్యాపార రంగాలు కొన్ని తెరమరుగవుతాయి. అదే సమయంలో కొన్ని కొత్త రంగాలు తెరపైకి వస్తాయి. అలాగే ఇప్పుడు మనం చూస్తున్న వ్యాపార రంగాలు కూడా కొత్త రూపు సంతరించుకుంటాయి. ఈ మార్పులకు అనుగుణంగా మారే సంస్థలు, ఓత్సాహిక పారిశ్రామికవేత్తలు మాత్రమే నిలదొక్కుకుంటారు. లేని వాళ్ళు మాత్రం తెరమరుగవుతారు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం విశ్లేషిస్తే తప్పనిసరిగా రాబోతున్న మార్పు ఒకటి ఉంది.
భవిష్యత్తులో అంతా డిజిటల్ మయయే : అంతా డిజిటల్ మయం. అంత డౌన్లోడ్ చేసుకోవడమే. అంతా ఆటోమేషన్. ఇదే మన ముందు ఆవిష్కరణ కాబోతున్న మరో ప్రపంచం. అవకాశం ఉంటే వర్క్ ఫ్రొం హోమ్. ఇది కూడా ఎంతకాలమో. మిగిలిన వాళ్ళు టీవీ, సోషల్ మీడియా, ఆన్ లైన్ కంప్యూటర్ గేమ్స్ లతో కాలక్షేపం చేస్తున్నారు. నాలుగు వారాల్లో ఇంత మార్పా! అవసరం ఎంత మార్పు అయినా చేస్తుందన్నమాట. దీన్నిబట్టి మనకు భవిష్యత్తు ముఖచిత్రం అర్థమవుతోంది.
కంటెంట్ ఆప్స్ …గేమ్స్ : ఇంట్లోనే కూర్చుంటే కాలక్షేపం ఎలా ? దీనికి పరిష్కారమే కంటెంట్ యాప్స్ అండ్ గేమ్స్. ఆన్లైన్ డిజిటల్ మీడియా కంటెంట్ వినియోగం ఇప్పటికే పెరిగింది. ఇంకా పెరుగుతుంది. వార్తాపత్రికలు పొద్దున్నే మీ ఇంటికి రావడం తగ్గిపోయి ఆ స్థానంలో ఈ పేపర్ చదవడం పెరుగుతోంది. పాఠకులా ఇష్టానికి అనుగుణంగా వార్తలు, ఇతర సమాచారం (సెర్చ్ బెస్ట్ కంటెంట్ ) అందించే గిరాకీ లభిస్తోంది. ఇండోర్ స్టేడియం లో గేములు ఆడటం తెగిపోయి మొబైల్స్, టేబుల్లో కంప్యూటర్ లో ల్యాప్ టాప్ లో గేమ్ ఆడడం పెరుగుతుంది. పిల్లలు పెద్దలు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ మొబైల్ లో కంప్యూటర్ గేమ్ లకు అలవాటు పడుతున్నారు. రిమోట్ కూడా పెరుగుతోంది. అంటే నలుగురు ఐదుగురు స్నేహితులు ఎవరి ఇంట్లో వారు కూర్చుని ఆన్లైన్ లో అందరూ ఒకటే గేమ్ ఆడటం అన్నమాట. షెడ్లు వంటి సంప్రదాయ క్రీడలతో పాటు సరికొత్త కంప్యూటర్ గేమ్ విషయంలోనూ ఇదే జరుగుతుంది. ఇక సినిమా ధియేటర్ లోకు వెళ్లడానికి బదులు ఇంట్లో టీవీ కంప్యూటర్ల ముందు కూర్చోవడం పెరుగుతుంది సినిమా రిలీజ్ థియేటర్ లో కాకుండా టీవీ లో విడుదలయ్యే రోజు ఎంతో దూరంలో లేదు మరి. ఆన్లైన్ లో సినిమాలు వీక్షించడం అలవాటైపోతుంది.
ఆన్లైన్ బ్యాంకింగ్..ఆన్లైన్ ఎడ్యుకేషన్ : సారి ఖాతా తెరిస్తే ఆ తర్వాత దాదాపు బ్యాంకు కు వెళ్లే పని ఉండదు. ఆన్లైన్ బ్యాంకింగ్ అయిపోతుంది. చెల్లింపులు, డిపాజిట్లు ఇతర లావాదేవీలన్నీ ఆన్లైన్ నే పూర్తి అయిపోతుంటాయి. ఇప్పటివరకు సెక్యూరిటీ భయంతోనో, మరేదైనా కారణంతో నో ఆన్లైన్ బ్యాంకింగ్ దూరంగా ఉన్నవారు కూడా ఆన్లైన్ బ్యాంకింగ్ మారిపోక తప్పదు మరి. అలాగే ఆన్లైన్ చదువులు కూడా పెరిగాయి. ట్యూషన్లు, కోచింగ్ లు హోమ్ ట్యూషన్లు సంఖ్య తగ్గిపోనుంది. ఆన్లైన్ ట్యూషన్, ఆన్లైన్ టుటర్, యూట్యూబ్ పాఠాలు పెరుగుతాయి. స్కూల్లో టీచర్ల కొరత కూడా ఇదే పరిష్కారం కాబోతోంది. తరగతి గదుల్లో బ్లాక్ బోర్డు బదులు డిజిటల్ వాల్ స్క్రీన్ సర్వసాధారణం అవుతుంది. డిజిటల్ పాఠం వినడం తప్పనిసరిగా కనిపించనున్న మార్పు. ఇంతేకాక ఆన్లైన్ కోచింగ్ లకు ఎంతో ధైర్యాన్ని వస్తుంది. అలాగే ఆన్లైన్ ఎడ్యుకేషన్ లో కొత్త ట్రెండ్ గేమిఫికేషన్ కి మంచి డిమాండ్ రాబోతుంది. పిల్లలకి చదువు మీద ఆసక్తి రేకెత్తించేందుకు గేమ్ఫికేషన్ దోహదపడుతుంది.
ఆన్లైన్ బిజినెస్ ఈ కామర్స్ : ఆన్లైన్ లో ఆర్డర్ అన్నీ ఇంటికి : చేతిలో డెబిట్ /క్రెడిట్ కార్డు ఉంటే చాలు. ఆన్ లైన్ ఆర్డర్ ఇస్తే అన్ని ఇంటికి వస్తున్నాయి. ఈ సదుపాయం రానున్న రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో అన్నిటికీ విస్తరించనుంది. అంతేకాక ఆన్లైన్ లో వస్తువులు తప్పించి చెప్పించుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. కరుణ వైరస్ వ్యాధి తగ్గిన తర్వాత కూడా ఈ సేవలు ఇలాగే కొనసాగితే అవకాశం ఉంది. షాపింగ్ మాల్స్ స్టోర్స్ కి వెళ్ళటానికి ప్రజలు మొగ్గు చూపారు.
వ్యాపారాలన్నీ ఇక కొత్తరూపు : శరవేగంగా మొబైల్ ఎకానమీ లోకి అడుగు పెడుతున్నాం. వ్యాపారంలో డిజిటల్ వాటా గణనీయంగా పెరుగుతోంది. తొలిదశలో కరోనా వైరస్ విస్తరించిన చైనా, దక్షిణ కొరియా, ఇటలీ దేశంలో గత మూడు నెలల కాలంలో ఆయా దేశాల ప్రజలు మొబైల్ ఫోన్లు మీద ఎంతగానో పెరుగుతుంది. ఒక సగటు వ్యక్తి మొబైల్ ఫోన్ పై వేయించే సమయంలో చైనాలో రోజు ఐదు గంటల చొప్పున పెరుగుతోంది. ఇప్పుడు ఇదే ధోరణి యూఎస్, యూకే, జపాన్, స్పెయిన్ దేశాల్లో కనిపిస్తోంది. సమాచారం, వినోదం, కాలక్షేపం, పని, నిత్యావసరాలు కొనుగోలు అన్నిటికీ మొబైల్ ఫోనే. అందువల్ల మొబైల్ ఒక మాధ్యమంగా సరికొత్త సేవలు అందించగల సంస్థలకు అనూహ్యమైన గిరాకీ రాబోతోంది. ప్రపంచ దేశాలు అన్నీ మొబైల్ ఎకానమీ వైపు అడుగు పెడుతున్న ఈ సమయం వ్యాపారానికి పెనుమార్పులు సూచిస్తున్నాయి. ఇవన్నీ కొన్ని ఉదాహరణలు మాత్రమే. కరుణ వైరస్ ముప్పు తప్పిపోయిన తర్వాత మన ఊహకు అందని ఎన్నో మార్పులు వాటి ఆధారంగా కొత్త వ్యాపార అవకాశాలు ప్రస్తుత వ్యాపార కొత్త రూపు సంతరించుకోవడానికి చూస్తాం. ఈ మార్పు అనూహ్యమైనది. శతాబ్ద కాలానికి ఒకసారి వచ్చేది. మనుషుల జీవన విధానాలను అనూహ్యంగా మార్చి వేసేది అని నిస్సందేహంగా చెప్పగలం.
అదే డిజిటల్ మరో ప్రపంచం : ఒకసారి ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోయాయి పిల్లలు స్కూలు కాలేజీలకు వెళ్లడం లేదు. డాక్టర్ దగ్గరకు వెళ్లే అవకాశం లేదు. సరదాగా బంధువులకు వెళ్దాం ఫ్రెండ్స్ తో కలిసి సినిమాకి వెళ్దాం తరహా సోషల్ ఇంటరాక్షన్ లేవు. గుళ్లు గోపురాలకు వెళ్లడం లేడా చర్చిలు, మసీదులో సామూహికంగా ప్రార్థన చేయడం లేదు. స్టేడియంలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ చూడటం రవీంద్రభారతిలో లైవ్ మ్యూజిక్ షో కి వెళ్లడం గచ్చిబౌలి స్టేడియంలో జేసుదాస్ పాటలు కచేరీ వంటి ప్రోగ్రాంలు పెట్టడం అనే ఆలోచనే రాదు. మన పూర్వీకులు కలరా మశూచి క్షయా వంటి వ్యాధులతో బాధ పడ్డారు. ఆ తర్వాత అవి దాదాపు అంతరించాయి. అదేవిధంగా ఇప్పుడు కూడా కరోనా వైరస్ వ్యాధి వచ్చే కొద్దినెలలోనూ ఏడాదికాలంకో తగ్గిపోవచ్చు. కానీ మనిషి పై పడిన ప్రభావం మాత్రం పూర్తిగా మానదు. మార్పు భయంతో చూస్తే అది ఒక సంక్షోభం సానుకూలంగా ఆలోచించే వారికి అది ఒక గొప్ప అవకాశం. ప్రతి సంక్షోభం ఒక అవకాశాన్ని కూడా కనిపిస్తుంది. ఆ సంక్షోభాన్ని ఎదుర్కొనే క్రమంలో మనిషి రాటుతెలితాడు. సంక్షోభాన్ని ఎది గెలిచి విపరీతమైన మానసిక స్థైర్యాన్ని సంతరించుకుంటాడు. భవిష్యత్తులో ఎటువంటి కష్టం వచ్చినా గెలిచే సత్తాసొంతం చేసుకుంటాడు.
డిజిటల్ హెల్త్ కేర్ : డిజిటల్ హెల్త్ కేర్ అనూహ్యంగా విస్తరించి బోతోంది. టెలీ మెడిసిన్ వైద్యుల ఆన్లైన్ కన్సల్టింగ్ సాధారణ అవుతుంది. డాక్టరు అపాయింట్మెంట్ తీసుకొని వ్యక్తిగతంగా కలిసి పని లేదు. వీడియో కాల్ లో పలకరిస్తే చాలు. ఆయన చెప్పిన టెస్టు చేయించుకుని రిపోర్టుల వాట్స్అప్ లో పంపిస్తే వాటిని చూసి పరిష్కారానికి ఆయనే వీడియో కాల్ లో చెబుతాడు. లేదా వాట్సాప్ మెసేజ్ వస్తుంది. సాధారణ లేటెస్ట్ చేయించుకోవడానికి టెక్నికల్ కి వెళ్లాల్సిన పనిలేదు ఇంటికి వచ్చి తీసుకు వెళ్తారు. సోషల్ డిస్టెన్స్ ఇన్ ఇప్పుడు పోదు మనుషులు ఒకరినొకరు కలుసుకున్నా ఒకటి రెండు మీటర్లు ఎడంగా ఉండి మాట్లాడుకోవడం అవుతుంది.అందువల్ల వైద్యులు కూడా రావడానికి బదులు రిమోట్ రిమోట్ సిస్టమ్ అభివృద్ధి చెందుతాయి. ఎన్నో రకాల వైద్య సేవలు రంగాలు డిజిటల్ పాత్ర పెరుగుతుంది
కరోనా ముప్పు తొలగిన తర్వాత మన జీవితాలు, వ్యాపారాలు ఎలా ఉండబోతున్నాయి అన్నది ఒక ప్రశ్న. ఇప్పటిలాగా మాత్రం ఉండవన్నది ఒక నిజం. మానవ సంబంధాల్లో, ఆర్థిక కార్యకలాపాల్లో, ఆధ్యాత్మిక చింతనలో, మానసిక పరిస్థితిలో, జీవనశైలిలో మార్పులు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు సామూహిక జీవనం మనకిష్టమైన జీవనశైలి. ఎప్పుడూ పదిమందితో కలిసి ఉండాలని కోరుకోవడం మన నైజం. స్నేహితులతో, బంధువులతో, విందు వినోదాల మీద ఎక్కడ లేని ప్రీతి. క్లబ్బులు పబ్బులు అంటే యువతకు మహా మోజు. కిక్కిరిసి ఉండే బస్టాండ్లు రైల్వేస్టేషన్లు విమానాశ్రయాలు మనం ఇష్టపడతాం. సినిమా హాళ్లు షాపింగ్ మాల్స్ కు వెళ్లడానికి ముచ్చట పడతాం. కానీ ఇక ముందు ఆ పరిస్థితి ఉంటుందో అన్నది సందేహం .బస్సు ఎక్కితే పక్కవాడిని తాకాలంటే భయం రోడ్ లో వెళుతూ ఉంటే ఎవరైనా తుమ్మితే ప్రాణాలు టికెట్ లోకి వస్తాయి అని భయం. మాంసం కొనాలి అంటే అనుమానం సినిమాకు వెళ్తే ఏమవుతుందో అన్న భయం. కనీసం ఒక ఏడాది పాటు బస్సు రైలు విమాన ప్రయాణాలకు ప్రజలు దూరంగా ఉంటారని నిపుణులు అంచనా. ఈలోగా హోటల్లో బస్సులు విమానాలు రైలు విహారయాత్రలో రెస్టారెంట్లో సినిమా హాల్లో షాపింగ్ మాల్ లో పగుళ్లు వంటివి పోవడం ఖాయం. మొత్తం మీద కరుణ తర్వాత మానవ జీవన శైలి వ్యాపార కార్యకలాపాల్లో పెను మార్పులు రావడం మాత్రం ఖాయం. ఇది చూస్తే మరో ప్రపంచం రాబోతుంది అని సూచిస్తున్నాయి.
-ఎల్ మారుతి శంకర్, మేనేజింగ్ డైరెక్టర్
సెవెన్ సీస్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్
98494 55777






