ఏంజెలీనా జోలీ 2 లక్షల డాలర్ల విరాళం
అమెరికాలో జాత్యహంకారానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలకు పలువురు సెలబ్రిటీలు అండగా నిలుస్తున్నారు. ఇందులో భాగంగా జాతి సమానత్వం, సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న పలు సంస్థలకు విరాళాలు అందిస్తున్నారు. ఈ జాబితాలో ప్రముఖ హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీ కూడా చేశారు. ఎన్ఎఎసిపి లీగల్ డిఫెన్స్ ఫండ్‌కు ఆమె 2 లక్షల డాలర్లు విరాళం ఇచ్చారు. జూన్ 4న 45వ పుట్టిన రోజు జరుపుకుంటున్న ఆస్కార్ అవార్డు విజేత ఏంజెలీనా ఈ మేరకు ఫండ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. హక్కులు ఇతరులకు ఇచ్చేందుకు ఏ ఒక్క గ్రూపునకో చెందినవి కావు. వివక్ష, శిక్ష మినహాయింపులకు సహించేది లేదు. ఈ సమాజంలో జరుగుతున్న తప్పులను ఎత్తిచూపేందుకు మనమందరం అమెరికన్లుగా ముందుకు వస్తామని ఆశిస్తున్నా అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జాతి సమానత్వం, సామాజిక న్యాయం, అత్యవసర చట్టపరమైన సంస్కరణలు డిమాండ్ చేస్తున్న ఎస్ఎఎసిపి లీగల్ ఫండ్‌కు అండగా ఉంటానని ఏంజెలీనా పేర్కొన్నారు.













