2019లో అత్యధిక వేతనం అందుకున్న అల్ఫాబెట్ అధినేత
తన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఓ) సుందర్ పిచాయ్‌కి 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను 281 మిలియన్ డాలర్ల పారితోషికం చెల్లించినట్లు ఇంటర్నెట్ దిగ్గజం అల్ఫాబెట్ ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం పొందుతున్న సిఇఓల జాబితాలోకి సుందర్ పిచాయ్ చేశారు. భారత్‌కు చెందిన సుందర్ పిచాయ్ 2019 డిసెంబర్ 3న అల్ఫాబెట్ పగ్గాలు చేపట్టారు. సుందర్ పిచాయ్ పారితోషికంలో అధిక భాగం స్టాక్ అవార్డుల రూపంలో చెల్లించారు. అంటే మార్కెట్లో అల్ఫాబెట్ షేర్ల హెచ్చుతగ్గులను బట్టి ఆయన వేతనాన్ని లెక్కిస్తారు. గత సంవత్సరానికి గాను పిచాయ్ వేతనం 6,50,000 డాలర్లు కాగా ప్రస్తుతం దాన్ని 2 మిలియన్ డాలర్లకు పెంచినట్లు అల్ఫాబెట్ తెలిపింది.













