న్యూయార్క్ లో విషాదం….
ప్రపంచంలో అత్యధిక కరోనా మరణాలు, కేసులతో విలవిలలాడుతున్న న్యూయార్క్ నగరంలో వెంటిలేటర్‌పై చికిత్స పొందిన రోగుల్లో దాదాపు 90 శాతం మంది ప్రణాలు కోల్పోయారని తాజా అధ్యయనంలో తేలింది. జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (జేఏఎమ్ఏ- జామా) జరిపిన పరిశోధనలో ఈ విషయం నిర్ధారణయ్యింది. న్యూయార్క్ నగరంలో అతిపెద్ద ఆరోగ్య వ్యవస్థ నార్తవెల్ హెల్త్. దీని ద్వారా నగరంలోని 12 హాట్‌స్పాట్ ప్రాంతాల్లోని ప్రత్యేక కరోనా ఆస్పత్రులలో 5700 మందికి చికిత్స అందించారు. వారిలో 20 శాతం మరణించగా, వెంటిలేటర్‌పై చికిత్స పొందినవారిలో 88 శాతానికి పైగా మరణాలు సంభవించాయి. కాగా వీరిలో మృతుల సగటు వయసు 63. అంతకన్నా పైబడినవారిలో 97 శాతం మరణాలు చోటుచేసుకున్నాయి. వీరిలో దాదాపు అందరూ హైపర్‌టెన్షన్, ఒబెసిటీ, మధుమేహం రోగులే.













