తానా ఎన్నికల సమరానికి సిద్ధం
ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) ఎగ్జిక్యూటివ్ కమిటీ కార్యవర్గానికి, బోర్డ్ డైరెక్టర్, ఫౌండేషన్ ట్రస్టీ, రీజినల్ రిప్రజెంటేటివ్ పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిటీ ప్రకటించిన తరువాత తానాలోని ఇరు వర్గాలు తమ తమ అభ్యర్థులతో గెలుపుకోసం ప్రచారాన్ని ప్రారం భించాయి. ప్రస్తుత అధ్యక్షుడు నిరంజన్ వర్గం నుంచి ఎగ్జిక్యూటివ్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ పదవికి సతీష్ వేమూరి పోటీ పడుతున్నారు. అంజయ్య చౌదరి, నరేన్ కొడాలి వర్గం నుంచి వైస్ ప్రెసిడెంట్ పదవికి నరేన్ కొడాలి పోటీ పడుతున్నారు. ఇరువర్గాలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలుపుకోసం ఇప్పటికే ప్రచారపర్వాన్ని ప్రారంభించాయి.
నిరంజన్ వర్గం తరపున
* నిరంజన్ వర్గం నుంచి బోర్డ్ డైరెక్టర్ల పదవులకు వెంకటరమణ యార్లగడ్డ, శిరీష తూనుగుంట్ల, శ్రీనివాస్ ఉయ్యూరు పోటీ పడుతున్నారు.
* ఎగ్జిక్యూటివ్ కమిటీకి సంబంధించి అశోక్ బాబు కొల్లా కార్యదర్శి పదవికి, మురళీ తాళ్ళూరి ట్రెజరర్ పదవికి, వంశీ వాసిరెడ్డి జాయింట్ సెక్రటరీ పదవికి, శశాంక్ యార్లగడ్డ జాయింట్ ట్రెజరర్ పదవికి, రజని ఆకురాతి కమ్యూనిటీ సర్వీస్ కో ఆర్డినేటర్ పదవికి, రజనీకాంత్ కాకర్ల కల్చరల్ సర్వీస్ కో ఆర్డినేటర్ పదవికి, మాధురి ఏలూరి ఉమెన్స్ సర్వీసెస్ కో ఆర్డినేటర్ పదవికి, ప్రదీప్ గడ్డం కౌన్సిలర్ ఎట్ లార్జ్ పదవికి, శ్రీధర్ కుమార్ కొమ్మాలపాటి (బాబి) ఇంటర్నేషనల్ కో ఆర్డినేటర్ పదవికి, శ్రీరామ్ ఆలోకం స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ పదవికి పోటీ పడుతున్నారు.
* ఫౌండేషన్ ట్రస్టీ పదవులకు రవి సామినేని, సత్యనారాయన మన్నె, సుమంత్ రామ్సెట్టి, నాగరాజు నలజుల, రవి కిరణ్ మువ్వ పోటీ పడుతున్నారు. డోనర్ కేటగిరీలో సురేష్ పుట్టగుంట, శ్రీధర్ గొట్టిపాటి పోటీపడుతున్నారు.
* రీజినల్ రిప్రజెంటేటివ్ పదవులకు పూర్ణచంద్ర కొండగుంట (అప్పలాచియాన్), రమేష్ మందల పు (క్యాపిటల్), పరమేష్ దేవినేని (డిఎఫ్ డబ్ల్యు), భాస్కర్ మల్లినేని (మిడ్ అట్లాంటిక్), శ్రీహర్ష గరిక పాటి (మిడ్ వెస్ట్), మౌనిక మణికొండ (న్యూ ఇంగ్లాండ్), రామకృష్ణ వాసిరెడ్డి (న్యూజెర్సి), దీపిక సమ్మెట (న్యూయార్క్), విష్ణు జంపాల (నార్త్), శ్రీధర్ చావా (నార్తర్న్ కాలిఫోర్ని యా), రాధాకృష్ణ పైడి (నార్త్ సెంట్రల్), శ్రీనివాస్ అబ్బూరి (నార్త్ `వెస్ట్), శివచావా (ఒహాయోవ్యాలీ), భానుప్రకాష్ గుళ్ళపల్లి (సౌత్`ఈస్ట్), సుమంత్ పుసులూరి (సౌత్ వెస్ట్) పోటీ పడుతున్నారు.
నరేన్ కొడాలి వర్గం తరపున
* నరేన్ వర్గం నుంచి బోర్డ్ డైరెక్టర్ల పదవులకు శ్రీనివాస్ లావు, రవి పొట్లూరి, మల్లిఖార్జున వేమన పోటీ పడుతున్నారు.
* ఎగ్జిక్యూటివ్ కమిటీకి సంబంధించి కార్యదర్శి పదవికి రాజా కసుకుర్తి, ట్రెజరర్ పదవికి భరత్ మద్దినేని, జాయింట్ సెక్రటరీ పదవికి వెంకట్ కోగంటి, జాయింట్ ట్రెజరర్ పదవికి సునీల్ పంట్ర, కమ్యూనిటీ సర్వీస్ కో ఆర్డినేటర్ పదవికి లోకేష్ కొణిదెల, కల్చరల్ సర్వీస్ కో ఆర్డినేటర్ పదవికి డా. ఉమ ఆర్ కటికి, ఉమెన్స్ సర్వీసెస్ కో ఆర్డినేటర్ పదవికి సోహ్ని అయినాల, కౌన్సిలర్ ఎట్ లార్జ్ పదవికి సతీష్ కొమ్మన, ఇంటర్నేషనల్ కో ఆర్డినేటర్ పదవికి టాగూర్ మల్లినేని, స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ పదవికి నాగ పంచుమర్తి పోటీ పడుతున్నారు.
* ఫౌండేషన్ ట్రస్టీ పదవులకు రామకృష్ణ చౌదరి అల్లు, భక్త బల్లా, శ్రీనివాస్ కూకట్ల, రాజా సూరపనేని, శ్రీనివాస్ ఎండూరి, శ్రీనివాస్ చంద్ గొర్రెపాటి (డోనర్ క్యాటగిరీ), విక్రమ్ ఇందుకూరి (డోనర్ క్యాటగిరీ) పోటీ పడుతున్నారు.
* రీజినల్ రిప్రజెంటేటివ్ పదవులకు రాజేష్ యార్లగడ్డ (అప్పలాచియాన్), సతీష్ చింత (క్యాపిటల్), సతీష్ కోటపాటి (డిఎఫ్ డబ్ల్యు), వెంకటేశ్వరరావు సింగు (మిడ్ అట్లాంటిక్), చిరంజీవి గల్లా (మిడ్ వెస్ట్), కృష్ణ ప్రసాద్ సోంపల్లి (న్యూ ఇంగ్లాండ్), డా. శ్రీనాథ్ కోణంగి (న్యూజెర్సి), శ్రీనివాస్ భర్తవరపు (న్యూయార్క్), నీలిమ మన్నె (నార్త్), వెంకట్ అడుసుమిల్లి (నార్తర్న్ కాలిఫోర్నియా), శ్రీమన్ యార్లగడ్డ (నార్త్ సెంట్రల్), సురేష్ పాటిబండ్ల (నార్త్ `వెస్ట్), ప్రదీప్ చందనం (ఒహాయోవ్యాలీ), శేఖర్ కొల్ల (రాకీ మౌంటెన్స్), ఇమేష్ గుత్త (సౌత్ సెంట్రల్), మధుకర్ యార్లగడ్డ (సౌత్ ` ఈస్ట్), కల్పన నూకవరపు (సౌత్ వెస్ట్) పోటీ పడుతున్నారు.
ఆన్లైన్ ఓటింగ్
ఈసారి తానా ఎన్నికలను ఆన్ లైన్ ఓటింగ్ ద్వారా నిర్వహిస్తున్నట్లు ఎన్నికల కమిటీ ప్రకటించింది. దీంతో అభ్యర్థులంతా తమ ప్రచారాన్ని సామాజిక మాద్యమం ద్వారా విస్తృతంగా చేస్తున్నారు. కొంతమంది వ్యక్తిగతంగా, మరికొందరు టీమ్‌తో పాటు ప్రచారాన్ని చేసుకుంటున్నారు.
హేమ కానూరు ఏకగ్రీవం
చికాగోకు చెందిన హేమ కానూరు తానా బోర్డుకు డోనర్ కోటాలో ఒక స్థానానికి నిర్వహిం చిన ఎన్నికల్లో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2023-27 కాలానికిగానూ ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.













