తెలుగు కుర్రాడు రుషత్ ఆబోటి రీసెర్చ్‌కు అరుదైన గౌరవం.. ఎంఐటీ యూఆర్టీసీ 2023కి ఎంపిక!
తెలుగు ఎన్నారై కుర్రాడు రుషత్ ఆబోటికి అగ్రరాజ్యంలో అరుదైన గౌరవం దక్కింది. అతను చేసిన రీసెర్చ్ పేపర్.. ప్రపంచ ప్రఖ్యాత ఎంఐటీ యూఆర్టీసీ 2023 (మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండర్గ్రాడ్యుయేట్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ రీసెర్చ్ కాన్ఫరెన్స్)కు ఎంపికైంది. ‘ఎన్హాన్స్డ్ ఫొటోమెట్రిక్ రెడ్‌షిఫ్ట్ ప్రిడిక్షన్స్ అండ్ అన్సర్టైనిటీ క్వాంటిఫికేషన్స్ యూజింగ్ డీప్ లెర్నింగ్ మెథడ్స్’ అనే పేరుతో రుషత్ ఒక రీసెర్చ్ చేశారు. అమెరికాలో అండర్ గ్యాడ్యుయేట్ స్థాయిలో చేసిన అత్యుత్తమ రీసెర్చ్ పేపర్స్.. ఎంఐటీ యూఆర్టీసీ రీసెర్చ్ కాన్ఫరెన్స్‌కు ఎంపికవుతాయి. వీటిలో రుషత్ రీసెర్చ్‌కు చోటు దక్కడంపై అతని స్నేహితులు, కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాలిఫోర్నియాలోని డోహర్టీ వ్యాలీ హై స్కూల్లో చదువుకుంటున్న రుషత్.. ఎంయూఎన్ డిబేట్లో కూడా బెస్ట్ డెలిగేట్‌గా గౌరవం దక్కించుకున్నాడు. తన ప్రయాణంలో ఫిజిక్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌పై బాగా ఫోకస్ పెట్టిన రుషత్.. మ్యూల్‌సాఫ్ట్ డెవలపర్‌గా కూడా నైపుణ్యాలు సంపాదించాడు. అలాగే ఫ్లట్టర్, డార్ట్ సాయంతో మొబైల్ యాప్స్ కూడా తయారు చేశాడు. అక్కడితో ఆగకుండా సాక్షి టీవీ యూఎస్ఏలో మీడియా ఇంటర్న్‌గా కూడా మెళకువలు నేర్చుకున్నాడు.













