యూఎస్‌లోనే అత్యంత ఎత్తైన హిందూ దేవుడి విగ్రహం ప్రతిష్ఠాపన
అమెరికాలోనే అత్యంత ఎత్తైన హిందూ దేవుడి విగ్రహాన్ని నేడు ప్రతిష్టించారు. డెలావేర్‌లోని హకెసిన్లో 25 అడుగుల పొడవున్న హనుమంతుడి విగ్రహాన్ని నేడు ప్రతిష్ఠించారు. డెలావేర్ ఆలయ అసోసియేషన్ అధ్యక్షులు పాటిబండ శర్మ ఇందుకు సంబందించిన వివరాలను తెలిపారు. బ్లాక్ గ్రానైట్‌తో 45 టన్నుల బరువున్న ఈ హనుమంతుడి విగ్రహాన్ని తెలంగాణలోని వరంగల్ ప్రాంతం నుంచి డెలావేర్కు తరలించినట్లు ఆయన వెల్లడించారు. సాంప్రదాయ పూజలతో పాటు యంత్ర ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ చేసి విగ్రహ ప్రతిష్ఠాపన చేసినట్లు తెలిపారు. డెలావేర్లో అతిపెద్ద రెండో విగ్రహంగా హనుమాన్ విగ్రహం నిలిచింది. న్యూ క్యాజిల్‌లోని లేడీ క్వీన్ ఆఫ్ పీస్ అతిపెద్ద విగ్రహంగా ఉంది.













